News April 11, 2025
‘గార్డెన్స్ బై ది వే’ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్: CM

TG: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని CM రేవంత్ ఆదేశించారు. మీర్ ఆలం ట్యాంక్‌పై 2km బ్రిడ్జి నిర్మించి, పర్యాటకులను ఆకట్టుకునేలా దానిపై ఐల్యాండులు ఏర్పాటు చేయాలన్నారు. సింగపూర్‌లోని ‘గార్డెన్స్ బై ది వే’ను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. బోటింగ్, రిసార్ట్స్, హోటల్స్ నిర్మించాలని, ఐలాండ్ జోన్‌ను జూపార్క్‌కు అనుసంధించాలని CM సూచించారు.
Similar News
News December 4, 2025
సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.
News December 4, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 4, 2025
పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.


