News April 3, 2025
పురుషులకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు!

USA సైంటిస్టులు విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు.
ఇంతకాలం స్త్రీలకే గర్భ నిరోధక మాత్రలుండగా, ఇప్పుడు పురుషులకూ సంతానోత్పత్తి నిరోధకాలు అభివృద్ధి చేశారు. ‘YCT-529’ పేరు గల ఈ మెడిసిన్ ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. ఎలుకలు, కొన్ని క్షీరదాలపై దీన్ని ప్రయోగించగా వాటి స్పెర్మ్ కౌంట్ తగ్గి సానుకూల ఫలితాలు వచ్చాయట. మెడిసిన్ వాడకం ఆపిన 6 వారాలకు తిరిగి సామర్థ్యం పొందాయి.
Similar News
News April 4, 2025
ఫార్మసీ విద్యార్థిని అంజలి మృతి

AP: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతిచెందారు. ఇవాళ తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని గత నెల 23న ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News April 4, 2025
BIG ALERT: నేడు భారీ వర్షాలు

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. TGలోని ములుగు, వరంగల్, వికారాబాద్, RR, మేడ్చల్, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. APలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News April 4, 2025
రైతులకు గుడ్న్యూస్.. యాసంగిలోనూ బోనస్

TG: ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.