News March 20, 2025

రాష్ట్రంలో పెరిగిన బాలికల జననాలు

image

AP: రాష్ట్రంలో బాలికల జననాలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 944 మంది బాలికల జననాలు నమోదయ్యాయి. 2014-15లో ఇది 1000:921గా ఉండేది. మరోవైపు జాతీయస్థాయిలో 2023-24లో ఇదే నిష్పత్తి 1000:930గా ఉంది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో 2023-24లో బాలికల జననాలు అధికంగా ఉండగా.. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, బిహార్‌లో తక్కువగా నమోదయ్యాయి.

Similar News

News January 28, 2026

అన్ని పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్స్

image

TG: రాష్ట్రంలో ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లపై QR కోడ్ ముద్రించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. కోడ్‌ను స్కాన్ చేయగానే పరీక్షా కేంద్రం లొకేషన్ చూపిస్తుంది. గతేడాది EAPCET హాల్ టికెట్లపై మాత్రమే QR కోడ్ ఇచ్చారు. ఈసారి <<18619737>>టెన్త్‌<<>> సహా ఇతర పరీక్షలకూ అమలు చేయనున్నారు. కాగా ఈసెట్-2026 షెడ్యూల్‌ నిన్న విడుదలైంది. FEB 9-APR 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 15న పరీక్ష ఉండనుంది.

News January 28, 2026

గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

image

AP: ఎట్టకేలకు 2023 గ్రూప్‌-2 రిజల్ట్స్ గత అర్ధరాత్రి విడుదలయ్యాయి. 905 పోస్టుల నోటిఫికేషన్‌కు APPSC 891 మందిని ఎంపిక చేసింది. స్పోర్ట్స్‌ కోటాపై HC ఆదేశాలతో 2 పోస్టులు పక్కన పెట్టగా, దివ్యాంగ, రిజర్వేషన్‌ కేటగిరీల్లో అభ్యర్థులు లేక 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా కోర్టు తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయని కమిషన్ పేర్కొంది.
– ఇక్కడ ఒక్క క్లిక్ చేసి ఈ రిజల్ట్ నేరుగా <>PDF డౌన్లోడ్<<>> చేసుకోవచ్చు.
Share It

News January 28, 2026

జీడిమామిడిలో టీ దోమ, ఆంత్రాక్నోస్ కట్టడికి సూచనలు

image

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.