News October 25, 2024

బిష్ణోయ్‌కు తగ్గ తమ్ముడే! అన్మోల్‌పై NIA రూ.10లక్షల బౌంటీ

image

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు తగినట్టే ఉన్నాడు తమ్ముడు అన్మోల్. వ్యవస్థీకృత నేరాలు చేయడంలో అతడిదీ అందెవేసిన చెయ్యే! ముంబైలో పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్‌లో అతడు జోక్యం చేసుకుంటున్నట్టు NIA గమనించింది. అతడి సమాచారమిస్తే రూ.10 లక్షల బౌంటీ ఇస్తామని ప్రకటించింది. 2022లో 2 ఛార్జిషీట్లలో NIA అతడి పేరు నమోదు చేసింది. యాక్టర్ సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.

Similar News

News November 2, 2025

ఏఐ ప్రభావాన్ని పెంచేలా నియామకాలు: సత్య నాదెళ్ల

image

భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విస్తరణ స్మార్ట్‌గా ఉంటుందని సంస్థ CEO సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని, ఈ నియామకాలు AI ప్రభావాన్ని పెంచేలా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా యాంత్రికంగా ఏదీ ఉండదన్నారు. AI సాయంతో వేగంగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. కాగా ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీలో 2.28L మంది ఉద్యోగులున్నారు. పలు దశల్లో 15K మందికి లేఆఫ్స్ ఇచ్చింది.

News November 2, 2025

FINAL: టాస్ ఓడిన భారత్

image

WWCలో నేడు భారత్‌తో జరగాల్సిన ఫైనల్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమ్ ఇండియా: షెఫాలీ వర్మ, స్మృతి మందాన, రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్(C), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
సౌతాఫ్రికా: లారా (C), బ్రిట్స్, బాష్, సునే లుస్, కాప్, జఫ్టా, డ్రెక్సెన్, ట్రైయాన్, డి క్లెర్క్, ఖాక, మ్లాబా.

News November 2, 2025

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.