News December 12, 2024
BITCOIN: 24 గంటల్లో ₹3.82 లక్షల ప్రాఫిట్

క్రిప్టోమార్కెట్లు నిన్న జోరుప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ $4500 (Rs 3.82L) లాభపడింది. మళ్లీ $1,01,125 వద్ద ముగిసింది. నేడు మాత్రం $450 నష్టంతో $1,00,676 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $2.02Tను టచ్ చేసింది. ఇక డామినెన్స్ 55%గా ఉంది. గత 24 గంటల్లో ETH 6, XRP 5, SOL 6, BNB 7, DOGE 8, ADA 10, TRON 7, AVAX 12, SHIB 9% మేర పెరగడం విశేషం.
Similar News
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


