News December 13, 2024
BITCOIN: 24 గంటల నష్టం రూ.95వేలు

క్రిప్టోమార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. బిట్‌కాయిన్ $లక్ష మార్కుకు అటూఇటూ దోబూచులాడుతోంది. నిన్న $1,02,540 వద్ద గరిష్ఠాన్ని తాకిన BTC $99,311 వద్ద కనిష్ఠాన్ని చేరింది. చివరికి $1120 (RS 95K) నష్టంతో $100,004 వద్ద ముగిసింది. నేడు $700 (RS 59K) నష్టంతో $99,292 వద్ద ట్రేడవుతోంది. ఎథీరియం $11 పెరిగి $3892 వద్ద కొనసాగుతోంది. XRP, SOL, BNB, DOGE, ADA, TRON, AVAX, SHIB లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Similar News
News January 2, 2026
చిక్కటి రక్తం నాకు ఇష్టం ఉండదు: ట్రంప్

డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన దానికన్నా ఎక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్రలు వేసుకుంటున్నానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘రక్తాన్ని పలుచగా చేసేందుకు ఆస్పిరిన్ బాగా పని చేస్తుందని డాక్టర్లు చెప్పారు. చిక్కటి రక్తం నా గుండె ద్వారా ప్రవహించడం నాకు ఇష్టం ఉండదు. పలుచని రక్తమే వెళ్లాలని కోరుకుంటా. అందుకే ఆస్పిరిన్ డోసులు ఎక్కువ వేసుకుంటున్నా. దీనివల్లే నా చేతిపై గాయాలు అవుతున్నాయి’ అని తెలిపారు.
News January 2, 2026
నాభి రహస్యం – ఆరోగ్యానికి మూలం

విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించడం సృష్టికి మూలం నాభి అని సూచిస్తుంది. తల్లి గర్భంలో శిశువుకు నాభి ద్వారానే జీవం అందుతుంది. మన శరీరంలోని 72 వేల నరాలు నాభి వద్దే అనుసంధానమై ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నాభికి నూనె రాస్తే జీర్ణక్రియతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేసి, సహజంగా రోగాలను నయం చేసే అద్భుతమైన ప్రక్రియ.
News January 2, 2026
వరి నారుమడికి రక్షణ కోసం ఇలా చేస్తున్నారు

వరి నారుమడిని పక్షులు, కొంగలు, పందుల నుంచి రక్షించడానికి కొందరు రైతులు వరి నారుమడికి నాలుగు వైపులా కర్రలు పాతి, తాడు కట్టారు. ఆ తాడుకు రంగు రంగుల ప్లాస్టిక్, తళతళ మెరిసే ఫుడ్ ప్యాకింగ్ కవర్స్, క్యాసెట్ రీల్స్, డెకరేషన్‌లో వాడే కలర్ కవర్స్ కడుతున్నారు. సూర్యరశ్మి వల్ల ఈ కవర్ల నుంచి వచ్చే కాంతి, గాలి వల్ల కవర్ల శబ్దంతో పక్షులు, పందులు అసౌకర్యంగా ఫీలై అవి నారు వైపు రావటం లేదని రైతులు అంటున్నారు.


