News January 24, 2025
కీలక స్థాయి వద్దకు BITCOIN
క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత 24 గంటల్లో మోస్తరుగా పుంజుకుంది. మొత్తం మార్కెట్ విలువ $3.55Tకి చేరుకుంది. బిట్‌కాయిన్ నేడు $750 నష్టంతో $1,03,179 వద్ద కొనసాగుతోంది. దీనికిది కీలక స్థాయి. నిన్న $1,06,850 నుంచి $1,01,262 మధ్య చలించింది. అంటే $6000 మేర ఊగిసలాడింది. డామినెన్స్ 57.7%గా ఉంది. 1.73% లాభపడిన ఎథీరియం $3,290 వద్ద ట్రేడవుతోంది. XRP 2.42, SOL 0.41, DOGE 2.68, BNB 1.50, AVAX 3.77% ఎరుపెక్కాయి.
Similar News
News January 24, 2025
ఘోరం: యువతిని రేప్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌లో..
ముంబైలో ‘నిర్భయ’ తరహా ఘటన సంచలనం రేపుతోంది. 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు చొప్పించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు గొరేగావ్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బ్లేడ్, రాళ్లను తొలగించారు.
News January 24, 2025
ట్రెండింగులో #AttackOnBSF
రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.
News January 24, 2025
CID చేతికి కిడ్నీ రాకెట్ వ్యవహారం?
HYD సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును ప్రభుత్వం CIDకి బదిలీ చేసే అవకాశముంది. ఇప్పటికే వైద్యశాఖ సమావేశంలో అధికారులు దీనిపై చర్చించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చారు. ఒక్కో ఆపరేషన్‌కు ₹50లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.