News November 12, 2024
సిల్వర్‌ను బీట్ చేసిన BITCOIN: అతిపెద్ద 8వ అసెట్‌గా రికార్డ్

బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. $1.752 ట్రిలియన్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో అసెట్‌గా అవతరించింది. $1.726 ట్రిలియన్లతో ఉన్న సిల్వర్‌ను అధిగమించింది. గత 24 గంటల్లో BTC ఏకంగా 9% పెరిగి $88,570 డాలర్లకు చేరడం గమనార్హం. మెటా $1.472, టెస్లా $1.124, బెర్కషైర్ హాత్వే $1.007 ట్రిలియన్ల కన్నా BTC విలువే ఎక్కువ. ఇక బంగారం $17.6 ట్రిలియన్లతో అతిపెద్ద అసెట్‌గా ఉంది.
Similar News
News October 29, 2025
కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.
News October 29, 2025
SECLలో 595 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్(SECL)లో<
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.


