News December 20, 2024

BITCOIN క్రాష్: 3 రోజుల్లో ₹9 లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 4.23% తగ్గి $3.33Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ డామినెన్స్ స్వల్పంగా పెరిగినా రేటు $2742 తగ్గింది. చివరి 3 సెషన్లలోనే BTC $10500 (₹9L) మేర పతనమైంది. ప్రస్తుతం $96037 వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ ఏకంగా 6.50% తగ్గి $3380 వద్ద ట్రేడవుతోంది. BNP 2.97, SOL 4.72, DOGE 11.42, ADA 6.52, AVAX 6.37, LINK 5.92, SHIB 8.18% మేర నష్టపోయాయి.

Similar News

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News November 21, 2025

మరో తుఫాను ‘సెన్‌యార్‌’!

image

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్‌యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్‌యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.

News November 21, 2025

కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.