News December 20, 2024
BITCOIN క్రాష్: 3 రోజుల్లో ₹9 లక్షల నష్టం

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 4.23% తగ్గి $3.33Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ డామినెన్స్ స్వల్పంగా పెరిగినా రేటు $2742 తగ్గింది. చివరి 3 సెషన్లలోనే BTC $10500 (₹9L) మేర పతనమైంది. ప్రస్తుతం $96037 వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ ఏకంగా 6.50% తగ్గి $3380 వద్ద ట్రేడవుతోంది. BNP 2.97, SOL 4.72, DOGE 11.42, ADA 6.52, AVAX 6.37, LINK 5.92, SHIB 8.18% మేర నష్టపోయాయి.
Similar News
News April 17, 2026
తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావట్లేదు: హార్దిక్

IPL 2026లో MI వరుసగా 4వ మ్యాచ్‌లోనూ ఓటమి పాలవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పడానికి ఏం లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదు. జట్టుగా విఫలమవుతున్నామా లేక ఆటగాళ్ల వ్యక్తిగత తప్పిదాలా? ప్లానింగ్‌లో లోపముందా? ఆలోచించుకొని తర్వాత ఏం చేయాలో చూస్తాం’ అని నిన్న PBKSతో ఓటమి తర్వాత అన్నారు. MI ఫెయిల్యూర్‌పై మీ అభిప్రాయం ఏంటి? Comment
News April 17, 2026
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

మారిన జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యల ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. దీనికోసం ఆహారంలో బియ్యం, మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.
News April 17, 2026
పడిపోయిన బొప్పాయి ధరలు

AP: యుద్ధం వల్ల అరబ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో బొప్పాయి ధరలు పడిపోయాయి. 2 వారాల కిందట టన్నుకు రూ.13 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. ఇప్పటికే అకాల వర్షాలు, వైరస్, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 30-40 టన్నులు రావాల్సి ఉండగా 10-15 టన్నుల పంటే చేతికి వచ్చింది. అటు దిగుబడి, ఇటు రేటు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తోటల్లోనే కాయలు పండిపోతున్నాయి.


