News January 1, 2025
మళ్లీ రూ.80 లక్షలకు BITCOIN

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ క్యాప్ 1% పెరిగి $3.26Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ 1.30% ఎగిసి $93,433 (Rs 80L) వద్ద కొనసాగుతోంది. నిన్న $783 (Rs 66K) పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.72%గా ఉంది. ఎథీరియమ్ 0.24% పెరిగి $3338 వద్ద చలిస్తోంది. మార్కెట్ డామినెన్స్ 12.33%గా ఉంది. XRP 4.17, BNB 0.51, SOL 0.39, DOGE 2.01, ADA 0.70, TRX 0.98% మేర పెరిగాయి.
Similar News
News January 19, 2026
గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా నిలుస్తాం: NATO దేశాలు

గ్రీన్‌లాండ్ ప్రజలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, UK దేశాలు జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాయి. ‘ఆర్కిటిక్ రక్షణకు కట్టుబడి ఉన్నాం. మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కలిసి పనిచేస్తాం. టారిఫ్ బెదిరింపులు ట్రాన్స్‌అట్లాంటిక్(US-యూరప్) సంబంధాలను దెబ్బతీస్తాయి. పరిస్థితులు మరింత దిగజారొచ్చు కూడా’ అని అమెరికాను హెచ్చరించాయి.
News January 19, 2026
శభాష్ హర్షిత్ రాణా.. నీపై బాధ్యత పెరిగింది!

NZతో జరిగిన వన్డే సిరీస్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన చేశారు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసి.. 83 రన్స్ చేశారు. అతను జట్టులో అవసరమా అన్న పరిస్థితి నుంచి జట్టుకు అతని అవసరముంది అనేలా రాణించారు. ట్రోల్స్‌ని పట్టించుకోకుండా ముందుకు సాగారు. కోచ్ గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. అతనికి బ్యాటర్‌గానూ అవకాశాలిస్తే జట్టులో మంచి ఆల్రౌండర్‌గా ఎదిగే ఆస్కారముందని క్రీడా నిపుణులు అంటున్నారు.
News January 19, 2026
జనవరి 19: చరిత్రలో ఈరోజు

1597: ఉదయపూర్ రాజు మహారాణా ప్రతాప్ మరణం * 1736: భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం * 1855: ‘ది హిందూ’ పత్రిక వ్యవస్థాపకుడు జి.సుబ్రహ్మణ్య అయ్యర్ జననం * 1905: భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం * 1972: భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1990: ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం (ఫొటోలో).


