News January 15, 2025
24 గంటల్లో Rs1.87 లక్షలు పెరిగిన BITCOIN

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో అదరగొట్టాయి. మార్కెట్ విలువ 2.93% ఎగిసి $3.37Tకి చేరుకుంది. 57% మార్కెట్ డామినెన్స్ ఉన్న బిట్కాయిన్ $94,836 నుంచి 2.43% పెరిగి $97,043 వద్ద ట్రేడవుతోంది. అంటే $2207 (Rs1.87L) లాభపడింది. ఎథీరియం సైతం 2.81% ఎగిసి $3226 వద్ద చలిస్తోంది. XRP ఏకంగా 9.69% పెరిగి $2.79కు చేరుకుంది. BNB 1.54, SOL 2.75, DOGE 5.51, ADA 7.63, AVAX 4.18, XLM 7.81% మేర పెరిగాయి.
Similar News
News November 5, 2025
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు నుంచి వెళ్తున్న బస్సు చింతకుంట వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఇలా జరిగినట్లు సమాచారం. బస్సులో ఎక్కువగా ఆదర్శ పాఠశాల, జడ్పీ పాఠశాల విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?
News November 5, 2025
ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ గైడెడ్ ఆమ్నియోసెంటెసిస్ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.


