News January 12, 2025

$94,500 వద్దే చలిస్తున్న BITCOIN

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ విలువ 1.20% పెరిగి $3.32Tకి చేరుకుంది. రేంజుబౌండ్లో చలించిన బిట్‌కాయిన్ $126 తగ్గి $94,599 వద్ద ముగిసింది. ప్రస్తుతం $94,597 వద్ద కొనసాగుతోంది. డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. ఎథీరియం 1.14% పెరిగి $3279 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 11.9 శాతంగా ఉంది. XRP 8.98, BNB 0.44, SOL 0.74, DOGE 3.44, ADA 10, AVAX 2.26 శాతం లాభపడ్డాయి.

Similar News

News November 26, 2025

మూవీ అప్డేట్స్

image

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్‌లో నటిస్తారని టాక్.

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

న్యూస్ అప్‌డేట్స్ @4PM

image

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ