News December 10, 2024

BITCOIN: 24 గంటల్లో రూ.3.16లక్షలు లాస్

image

క్రిప్టో కరెన్సీ పెద్దన్న బిట్‌కాయిన్‌లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. 24 గంటల్లోనే $3736 (Rs.3.16L) నష్టపోయింది. నేడు మాత్రం స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. $97,318 వద్ద ఓపెనైన BTC $97,040 వద్ద కనిష్ఠ, $98,159 వద్ద గరిష్ఠ స్థాయుల్ని అందుకుంది. $477 లాభంతో $97,960 వద్ద చలిస్తోంది. ఇక ఎథీరియమ్ 4.86, XRP 10.45, సొలానా 5.78, BNP 4.96, DOGE 9, ADA 12.73, షిబాఇను 13% మేర పతనమయ్యాయి. క్రిప్టో Mcap తగ్గింది.

Similar News

News November 5, 2025

రబీలో రాగులు సాగు – ముఖ్య సూచనలు

image

రాగులును విత్తడానికి ముందు kg విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా మాంకోజెబ్ 2గ్రాములతో విత్తనశుద్ధి చేయాలి. తేలికపాటి దుక్కిచేసి విత్తనం చల్లి పట్టె తోలాలి. నారుపోసి నాటాలి. 85-90 రోజుల రకాలకు 21 రోజుల మొక్కలను, 105-125 రోజుల పంటకాలం గల రకాలకు 30 రోజుల మొక్కలను నాటాలి. స్వల్పకాల రకాలకు వరుసల మధ్య 15cm, మొక్కల మధ్య 10cm, దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20cm, మొక్కల మధ్య 15cm దూరం ఉండేలా విత్తాలి.

News November 5, 2025

వీటిని క్లీన్ చేస్తున్నారా?

image

మేకప్‌ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. కానీ వాటిని ఏడాదికోసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే మేకప్‌ అప్లికేషన్‌, బ్లెండింగ్‌ నాణ్యత తగ్గుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మసమస్యలు వస్తాయి. వేడి నీళ్లు, డిష్‌ వాషర్‌ సోప్‌, యాంటి బ్యాక్టీరియల్‌ సోప్‌, బేబీషాంపూతో వాటిని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.

News November 5, 2025

ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

image

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.