News January 13, 2025
గంటలో రూ.1,50,000 నష్టపోయిన BITCOIN

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో స్తబ్ధుగా చలించాయి. మార్కెట్ విలువ 0.05% తగ్గి $3.31Tకు చేరుకుంది. నిన్న 0.36% తగ్గిన బిట్‌కాయిన్ నేడు వ్యవధిలోనే 1.34% పడిపోయింది. $95,920 నుంచి $94,150కు చేరుకుంది. అంటే $1770 (Rs 1.50L) మేర తగ్గింది. మార్కెట్ డామినెన్స్ 56.7%గా ఉంది. ఇక ఎథీరియం 0.79% పడిపోయి $3,258 వద్ద ట్రేడవుతోంది. XRP 0.12, BNB 1.0, DOGE 1.42, ADA 6.55, TRX 3.60, AVAX 2.55% మేర ఎరుపెక్కాయి.
Similar News
News January 11, 2026
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అలర్ట్

ఈ-కామర్స్ సంస్థలు మరో భారీ సేల్స్‌కు రెడీ అయ్యాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. ఫోన్లు, TVలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను ఇస్తున్నాయి.
News January 11, 2026
జనవరి 11: చరిత్రలో ఈరోజు

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన రోజు * 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం * 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం * 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు (ఫొటోలో) * 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం
News January 11, 2026
పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఏర్పాట్లు

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 లేన్లలో విజయవాడ వైపు ప్రస్తుతం 8 లేన్లు అందుబాటులో ఉండగా, రద్దీ పెరిగితే వాటిని 10కి పెంచనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి లేన్‌లో 2 హ్యాండ్ స్కానర్లు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణకు స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.


