News January 8, 2025

BITCOIN షాక్: 24 గంటల్లో Rs5 లక్షల నష్టం

image

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 6.29% తగ్గి $3.36Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా 5.45% ఎరుపెక్కింది. $1,02,000 నుంచి $96,000కు తగ్గింది. అంటే $6000 (Rs 5.10L) నష్టపోయింది. మార్కెట్ విలువ $1.91Tకి తగ్గింది. ఇథీరియం 9.98% పడిపోయి $3,349 వద్ద కొనసాగుతోంది. XRP 4.16, BNB 4.59, SOL 8.95, DOGE 10.53, ADA 8.77, TRON 7.56, SUI 7.32, LINK 10.51% మేర ఎరుపెక్కాయి.

Similar News

News January 9, 2025

హెల్మెట్ ధారణలో పురోగతి: హైకోర్టు

image

AP: ప్రతి 10 మంది ద్విచక్రవాహనదారుల్లో ముగ్గురు హెల్మెట్ ధరిస్తున్నారని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలతో చేపట్టిన చర్యల వల్ల పురోగతి కనిపిస్తోందని సంతృప్తి వ్యక్తం చేసింది. గత 20 రోజుల్లో రూ.95 లక్షల చలాన్లు వసూలు చేశారని, ఫైన్లు విధించడమూ పెరిగిందని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధరించకపోవడం జరిగే నష్టాలను పత్రికలు, టీవీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

News January 9, 2025

ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు

image

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.

News January 9, 2025

ప్రముఖ నిర్మాత కన్నుమూత

image

ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది(73) కన్నుమూశారు. తానొక మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ప్రితీశ్ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, మీరాబాయ్ నాటౌట్, అగ్లీ ఔర్ పాగ్లీ, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలు నిర్మించారు. జర్నలిస్టుగానూ సుపరిచితుడైన ప్రితీశ్ TOI తదితర సంస్థల్లో పనిచేశారు. గతంలో ఆయన రాజ్యసభ ఎంపీగానూ వ్యవహరించారు.