News January 2, 2025
జోరుపెంచిన BITCOIN.. 14% పెరిగిన XRP

గత 24 గంటల్లో క్రిప్టో కరెన్సీలు జోరు ప్రదర్శించాయి. మార్కెట్ విలువ 2.49% పెరిగి $3.35Tకు చేరుకుంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56.2, 12.2 శాతంగా ఉన్నాయి. బిట్‌కాయిన్ నిన్న $1015 లాభపడి $94,591 వద్ద ముగిసింది. నేడు $574 లాభంతో $95,166 వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.25% ఎగిసి $3,383 వద్ద ట్రేడవుతోంది. XRP ఏకంగా 14.70% పెరిగి $2.41 వద్ద చలిస్తోంది. SOL 5.20, DOGE 4.37, ADA 9.97, AVAX 8.87% పెరిగాయి.
Similar News
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.