News December 9, 2024
BITCOIN UPDATE: నష్టాల్లోనే టాప్ 10 కాయిన్స్

క్రిప్టో కరెన్సీ రారాజు బిట్‌కాయిన్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. నేడు $1.01 లక్షల వద్ద ఓపెనైన కాయిన్ అదే స్థాయి వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో $99,245 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం $1663 నష్టంతో $99,452 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.39% నష్టపోయి $3948 వద్ద కొనసాగుతోంది. టాప్ 10 కాయిన్స్ అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.
Similar News
News January 4, 2026
‘జెలెన్స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.
News January 4, 2026
అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్‌లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.


