News February 9, 2025
BJPని గెలిపించాలి: MLA హరీశ్ బాబు

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కోరారు. కాగజ్‌నగర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి అందివచ్చిన అవకాశమని అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News March 12, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
News March 12, 2025
ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు చర్యలు: బాపట్ల కలెక్టర్

ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను, సీనియర్ నాయకులను ఆహ్వానిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఏవైనా పరిష్కరించని సమస్యల ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీ నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి భారత ఎన్నికల సంఘం సూచనలను ఆహ్వానిస్తుందన్నారు.
News March 12, 2025
పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడాలి: కలెక్టర్

పార్వతీపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓపిఆర్డీలకు స్వచ్ఛ సుందర పార్వతీపురం పై శిక్షణా కార్యక్రమం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీలు పోటీపడి తమ పంచాయతీలను నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.