News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA

పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Similar News
News November 27, 2025
మీడియా సెంటర్ను ప్రారంభించిన NZB కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
News November 27, 2025
NZB: మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ ల దాఖలు పర్వం మొదలైంది. తొలి దశ ఎన్నికలు జరిగేబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్ లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.
News November 27, 2025
NZB: మొదటి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే?

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో 11 మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికల్లో 2,61,210 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. ఇందులో మహిళలు 1,37, 413 మంది, పురుషులు 1,23,790 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఇందు కోసం 1,653 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు వివరించారు.


