News February 8, 2025

BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA

image

పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Similar News

News November 14, 2025

వన్ వే సిస్టమ్‌ను పరిశీలించిన నిజామాబాద్ సీపీ

image

నిజామాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే దేవీ రోడ్డులో వన్ వే సిస్టమ్ అమలు పరిస్థితిని సీపీ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మమేకమై వన్‌వే అమలుతో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులు గురించి ప్రత్యక్షంగా ఆరా తీశారు. అదేవిధంగా పార్కింగ్ సౌకర్యాలు, బై లెన్లు, గంజ్-గాంధీచౌక్ ప్రాంతాల ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ పాల్గొన్నారు.

News November 13, 2025

భీమ్‌గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

image

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

News November 13, 2025

నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్

image

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.