News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA

పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Similar News
News February 11, 2026
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బెజ్జూర్ మండలం హేటిగూడ గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా అభిరామ్(6) సోమవారం మృతిచెందగా నగోశ్ మొండి (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వ్యక్తి వడాయి మోహన్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై సర్తాజ్ పాషా కేసు నమోదు చేశారు.
News February 11, 2026
WGL: మున్సి’పోల్’.. ఓటు కోసం తరలివెళ్తారా?

పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా? అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వర్ధన్నపేటలో 88.63%, నర్సంపేట 82.26%, డోర్నకల్ 83.20%, మరిపెడ 82.88%, పరకాల 81.89%, జనగామ 79.32%, MHBD 78.01%, తొర్రూర్ 72.62%, BHPLలో 63.37% పోలింగ్ శాతం నమోదైంది. ఈ సారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మునిసిపాలిటీల్లోని 260 వార్డుల్లో 3.35 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News February 11, 2026
ప్రకాశం: మల్లన్న దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. పులి సంచారం

నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మంగళవారం పెద్దపులి కంటబడింది. పెచ్చేరువులో అన్నదాన శిబిరానికి సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు ఓ పెద్ద పులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు తమ మొబైల్స్‌లో పెద్ద పులిని చిత్రీకరించారు. కాగా అభయారణ్యంలో కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తలు వహించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.


