News April 28, 2024

BJPని KCR కంట్రోల్ చేశాడు: MP అర్వింద్

image

రాష్ట్రంలో BJPని KCR కంట్రోల్ చేశారని నిజామాబాద్ MP అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు BJP, BRS ఒక్కటే అంటూ ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. BRS హయాంలో రాష్ట్రంలో BJPని కంట్రోల్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం BJPని ఆపలేదని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి కూడా BJPలో చేరుతాడని అర్వింద్ అన్నారు.

Similar News

News December 7, 2025

NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.

NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.