News May 10, 2024
BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు: సీఎం రేవంత్‌రెడ్డి
పాలమూరును సస్యశ్యామలం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మక్తల్ జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ వస్తేనే పాలమూరుకు రైలు, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా. BJPకి వేసే ప్రతి ఓటు.. మీ రిజర్వేషన్ల రద్దుపై తీర్పు. మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. మోదీ మళ్లీ గెలిస్తే మనుషుల మధ్య చిచ్చు పెడతాడు. బీజేపీకి ఎవరైనా ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం అవుతుంది’ అని అన్నారు.
Similar News
News November 17, 2024
కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం: శ్రీనివాసరెడ్డి
పాలమూరు నుంచే ప్రారంభమైన కేసీఆర్ ప్రస్థానం ఇక్కడి నుంచే పతనం ప్రారంభమైందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాపై కల్వకుంట్ల కుటుంబం విషం చిమ్ముతుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా వారు కుట్రలు చేస్తుంన్నారని ఆరోపించారు. వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడే అభివృద్ధి మొదలైందని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే మట్టి కొట్టుకుపోతారని విమర్శించారు.
News November 16, 2024
వనపర్తి: ‘కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకు’
కులగణనకు 56 ప్రశ్నలు ఎందుకని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కులగణులకు వారి సామాజిక వర్గం వివరాలు సేకరిస్తే సరిపోతుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్లు, పశువుల వివరాలు అవసరమా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం చేసేందుకే ఇన్ని ప్రశ్నలు పెట్టారన్నారు. సర్వేను పునః పరిశీలించాలన్నారు.
News November 16, 2024
‘మెడికల్ హబ్’ గా కొడంగల్
‘మెడికల్ హబ్’గా కొడంగల్ మారనుంది. అందులో భాగంగానే వైద్య, నర్సింగ్, పారామెడికల్ కళాశాలు మంజూరు అయ్యాయి. ఇప్పటికే భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. అయితే నర్సింగ్ కాలేజీకి అడ్మిషన్లు జరగడంతో కలెక్టర్ ఆదేశాలతో కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు.