News February 19, 2026
BJPని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి: అర్వింద్

TG: రాష్ట్రంలో BJPని 20 ఏళ్లుగా కొందరు కోవర్టులు పట్టి పీడిస్తున్నారని నిజామాబాద్ MP అర్వింద్ వ్యాఖ్యానించారు. అలాంటి వారు వెంటనే పార్టీని వీడి వెళ్లాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉత్తర భాగంలో పార్టీ పటిష్ఠంగా ఉందని, దక్షిణ ప్రాంతంలోనే మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. ‘ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా? కేసుల వల్లే నిజామాబాద్‌లో BRS కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది’ అని విమర్శించారు.
Similar News
News February 19, 2026
యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్!

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
News February 19, 2026
పాక్‌లో పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ కరాచీలోని ఓ మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భవనం మొత్తం కూలిపోవడంతో ఇప్పటివరకు 16 మంది మరణించారని, మరో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అసలు కారణం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా కరాచీలో గతేడాది కూడా ఐదంతస్తుల భవనం కూలడంతో 27 మంది మరణించారు.
News February 19, 2026
తిన్న వెంటనే వాటర్ తాగొచ్చా?

భోజనం అయిన వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలా చేస్తే ఎంజైమ్‌లు, జీర్ణరసాలు పలుచబడి డైజెషన్ మందగిస్తుంది. ఫలితంగా బాడీ పోషకాలను సరిగా గ్రహించుకోలేదు. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం తినడానికి 10 నిమిషాల ముందు లేదా తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగడం బెటర్. అవసరమైతే భోజనం మధ్యలో చిన్న సిప్స్ తాగొచ్చు.


