News April 25, 2024
BJP యువమోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా శివరామ

BJP యువమోర్చా రాష్ట్ర సెక్రటరీగా అనపర్తి నియోజకవర్గానికి చెందిన శివరామ కృష్ణంరాజు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధీశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత శివరామకృష్ణంరాజును ప్రకటించినా.. కూటమి సమీకరణాల్లో భాగంగా అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మార్చారు. దీంతో శివరామకు ఈ పదవి ఇచ్చారు.
Similar News
News November 9, 2025
తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.
News November 8, 2025
తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
News November 8, 2025
రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


