News March 25, 2025
BJP స్టేట్ చీఫ్గా ఎంపీ అర్వింద్?

ఉగాదిలోపు తెలంగాణ బీజేపీకి కోత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే బీసీ నేతను నియమిస్తారా.. లేక ఓసీకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
ఏలూరు: BSNL టవర్లపై MP పుట్టా మహేష్ వినతి

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న BSNL మొబైల్ టవర్లను ఏర్పాటుచేయాలని MP పుట్టా మహేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కోరారు. శుక్రవారం పార్లమెంట్లో మంత్రిని కలిసిన ఎంపీ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్ సేవలు, ఇతర ప్రజా సేవలందించే కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు.
News December 5, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

సంగారెడ్డి జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు గడువును డిసెంబర్ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 5, 2025
NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.


