News April 19, 2024

BJP అభ్యర్థి డీకే అరుణ ఆస్తుల వివరాలు

image

BJP అభ్యర్థి డీకే అరుణ గురువారం నామినేషన్ దాఖలు చేయగా.. అఫిడవిట్ వివరాలు సమర్పించారు. చరాస్తుల విలువ-రూ.3,21,73,518, స్థిరాస్తులు-రూ.3,10,00,000, బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు- లేవు, ప్రస్తుతం దగ్గర ఉన్న నగదు- రూ.1,50,000, అరుణ భర్త భరతసింహారెడ్డి ఆస్తులు: చరాస్తుల విలువ- రూ.23,26,16,353 స్థిరాస్తులు- రూ.37,17,80,000, అప్పులు-1,38,79,619, ప్రస్తుతం ఉన్న నగదు-రూ.20,000,00 ఉన్నట్లు తెలిపారు.

Similar News

News April 23, 2025

బాలానగర్‌: ‘8 K.M నడిచి.. 434 మార్కులు సాధించిన గిరి పుత్రిక’

image

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హేమలత.. 434/440 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నిరుపేదలు. వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. హేమలత ప్రతిరోజు.. కళాశాలకు ఉదయం 4 కి.మీ, సాయంత్రం 4.K.M నడుస్తూ.. కళాశాలకు వచ్చి చదువుకొని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం, కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.

News April 23, 2025

బీజేపీ నేత హత్యకు కుట్ర: MBNR ఎంపీ అరుణ

image

దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.

News April 23, 2025

MBNR: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ విజయేంద్రబోయి అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

error: Content is protected !!