News February 2, 2026

BJP ఏజెంట్‌లా EC పనిచేస్తోంది: మమతా

image

వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్‌తో మీటింగ్ అనంతరం ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 58 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ కమిషన్ BJP ఏజెంట్‌లా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు TMC కార్యకర్తలు అధికారులపై దాడులు చేస్తున్నారని, BLOలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని EC పేర్కొంది.

Similar News

News February 18, 2026

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

image

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.

News February 18, 2026

EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

image

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

News February 18, 2026

నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

image

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.