News January 20, 2026
BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్‌లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!
Similar News
News February 2, 2026
శ్రీవారి ఆలయం వద్ద సరికొత్త టెక్నాలజీ

AP: తిరుమలలో భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటూ వాహన సేవల దర్శనాలపై కచ్చితమైన సమాచారాన్ని అందించనున్నాయి. వీటిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
News February 2, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBM, PGDBA, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. FEO పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News February 2, 2026
మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక ప్రధాన వ్యాధులకు ఇది కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో జననాంగాల్లో ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


