News June 4, 2024
BJP 242 vs INC 105: పెరిగిన కాంగ్రెస్ సీట్లు

లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటములు నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే 288, ఇండియా 225 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీ డామినేటింగ్ పొజిషన్లో ఉంది. 240 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 105 సీట్లకు పెరిగింది. దాదాపుగా పదేళ్ల తర్వాత రాహుల్ సేన సీట్లు వందకు పెరగడం గమనార్హం.
Similar News
News February 6, 2026
మూడేళ్లుగా ఆన్లైన్లో వేధింపులు: నటి

మూడేళ్లుగా తాను SMలో వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి పోస్ట్ చేశారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని IGలో ఆమె కోరారు. ఈ విషయమై చట్టపరంగా వెళ్లినా వేధింపులు ఆగలేదన్నారు. సబరిష్ అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి నకిలీ ఖాతాల ద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు తెలిపారు. లవ్ టుడేలో నటించిన రవీనా త్రిష, దీపికా పదుకొనే, సమంత వంటి స్టార్లకు డబ్బింగ్ చెప్పారు.
News February 6, 2026
స్మృతి.. వాట్ ఏ ఛాంపియన్

కొన్ని రోజుల క్రితమే ప్రియుడితో అనూహ్య పరిస్థితుల్లో పెళ్లి రద్దయ్యి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు క్రికెటర్ స్మృతి మంధాన. దీనిపై పలు రకాలుగా ప్రచారం జరిగినా ఆమె పట్టించుకోలేదు. తిరిగి కొన్ని రోజులకే బ్యాట్ పట్టారు. శ్రీలంకతో సిరీస్లో ఫర్వాలేదనిపించినా WPLలో ఆర్సీబీ సారథిగా సత్తా చాటారు. సీజన్లో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ఫైనల్లో POTMగా నిలిచి అసలైన ఛాంపియన్ అనిపించుకున్నారు.
News February 6, 2026
ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)


