News June 4, 2024

BJP 400 పార్ పాచికలు పారలేదు

image

ఈసారి 400 స్థానాల్లో గెలుస్తామన్న BJP అంచనాలు తలక్రిందులయ్యాయి. 2014, 19లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273 సాధించిన కమలం పార్టీ ఇప్పుడు ఈ నంబర్‌ను చేరేందుకు ఇబ్బంది పడుతోంది. దీంతో మిత్రపక్షాల మద్దతుతోనే మోదీ పీఎం కావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు NDA-INDIA మధ్య సీట్ల తేడా 100 లోపే ఉంది. దీంతో రామమందిరం, GDP, విశ్వగురు, విజన్ 2047 వంటి అంశాలు ప్రజలను అనుకున్నంతగా ఆకట్టుకోలేదని అర్థమవుతోంది.

Similar News

News January 23, 2025

BIG NEWS.. రాష్ట్రంలో రూ.60వేల కోట్ల పెట్టుబడులు

image

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో అమెజాన్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడిపై ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ సంస్థ MOU చేసుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుంది. అటు నిన్న ఒక్కరోజే రూ.56వేల కోట్లకుపైగా పెట్టుబడులపై పలు సంస్థలతో ప్రభుత్వం <<15232469>>ఒప్పందం <<>>కుదుర్చుకుంది.

News January 23, 2025

ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!

image

విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.

News January 23, 2025

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

image

హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.