News January 10, 2025
ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ
TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు తమ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి, కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను పార్టీ ప్రకటించింది.
Similar News
News January 10, 2025
ప్రభాస్ అభిమానులకు గుడ్, బ్యాడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్, బ్యాడ్ న్యూస్ అందనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ పోస్టర్ను మేకర్స్ విడుదల చేస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్ర విడుదలను ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేస్తున్నట్లు టాక్. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
News January 10, 2025
ఈ మేక ఖరీదు రూ.13.7 లక్షలు
ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని విక్రయం కోసం సౌదీ అరేబియాలో ప్రత్యేకంగా వేలం నిర్వహించగా ఔత్సాహికులు ఆకర్షితులై పోటీపడ్డారు. వేలంలో ఓ సౌదీ వ్యక్తి దీనిని 60,000 సౌదీ రియాల్స్కు(రూ.13.74 లక్షలు) కొనుగోలు చేశారు. దీంతో మేకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
News January 10, 2025
టెస్టు జెర్సీతో జడేజా పోస్టు.. రిటైర్మెంట్పై చర్చలు
IND ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇన్స్టాలో తన ఎనిమిదో నంబర్ టెస్టు జెర్సీ ఫొటోను షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన అతను టెస్టులకూ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అతను టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. కాగా జడేజా 80 టెస్టుల్లో 3,370 రన్స్ చేసి, 323 వికెట్లు పడగొట్టారు.