News October 10, 2025

ఎల్లుండి జూబ్లీ‌హిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ప్రకటన?

image

TG: జూబ్లీ‌హిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం BJP తీవ్ర కసరత్తు చేస్తోంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవితో పాటు మరొకరిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అక్కడ చర్చించి ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే ఈ అభ్యర్థుల పేర్లతో కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని టాక్.

Similar News

News October 10, 2025

మంత్రులూ! ప్రాజెక్టుల పూర్తి బాధ్యత మీదే: CBN

image

AP: శాఖలను సమర్థంగా నడపాల్సిన బాధ్యత మంత్రులదేనని CM CBN స్పష్టం చేశారు. ‘గతంలో లేనన్ని పెట్టుబడులు వస్తున్నాయి. శాఖల అధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేయించండి. మాట వినకుంటే గట్టిగా చెప్పండి. అవి సకాలంలో పూర్తికావాలి. ప్రజలకూ చెప్పాలి. ఎన్నికల్లో పోటీచేసేది మీరే అని తెలుసుకోండి’ అని క్యాబినెట్ చివర్లో సీఎం హితబోధ చేసినట్లు సమాచారం. YCP కుట్రల్ని తిప్పికొట్టాలని నిన్నకూడా వారికి బాబు సూచించారు.

News October 10, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఇవాళ రాత్రి లండన్ పర్యటనకు బయల్దేరనున్న మాజీ CM YS జగన్ దంపతులు
* అమ్మాయిల సమస్యల ఫిర్యాదుకు త్వరలో ఆన్‌‌లైన్ పోర్టల్ తెస్తామన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
* ఆర్‌పేట సీఐపై చిందులేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ విద్యాసాగర్
* చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందన్న మాజీ మంత్రి విడదల రజనీ

News October 10, 2025

AP క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

*రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం
*పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌లుగా మార్చేందుకు అనుమతి
*పంచాయతీల వర్గీకరణకు ఆమోదం
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్పు
*విశాఖలో రూ.87వేల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం
*గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమి కేటాయింపు