News April 24, 2024

బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం.. కేటీఆర్ సెటైర్

image

సూరత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్-నో ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ పనితీరు బాగుంది’ అని పేర్కొన్నారు. సూరత్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.

Similar News

News March 10, 2026

ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరల్

image

సినీ హీరో ప్రభాస్ లేటెస్ట్ ఫొటో SMలో వైరల్ అవుతోంది. ఆయనతో మలయాళం డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్‌ దిగిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించారు. అటు ప్రభాస్‌తో మూవీ తీసేందుకు ఆసక్తి చూపుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ డైరెక్టర్ ద్వారా స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ, కల్కి-2 మూవీల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

News March 10, 2026

భారత్‌లో టాప్ శాలరీ ₹8కోట్లు!

image

దేశంలో AI, సెమీకండక్టర్స్, EV, బ్యాటరీ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల ఉద్యోగులకు డిమాండ్ ఉందని ఇండియా శాలరీ గైడ్ 2026 వెల్లడించింది. స్కిల్‌ను బట్టి సంస్థలు 30% వరకు హైక్ ఇస్తున్నాయంది. టాప్ శాలరీల్లో ఫైనాన్స్ రంగం గరిష్ఠంగా ₹8Cr/yr ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లోనూ భారీ జీతాలు ఉన్నాయంది. CEO స్థాయి వారికి శాలరీతో పాటు బోనస్‌/షేర్లతో అదనపు ఆదాయం ఉంటుంది.

News March 10, 2026

ఇండిగో సీఈఓ రాజీనామా

image

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్‌పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.