News March 19, 2024
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ మరో జాబితా ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఇవాళ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, పేర్లు ప్రకటించనుంది. తెలంగాణలోని 15 స్థానాలకు పేర్లు ప్రకటించగా.. మిగిలిన 2 స్థానాలు, పొత్తులో భాగంగా ఏపీలో పోటీ చేసే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News April 4, 2025
పిఠాపురంలో నాగబాబు పర్యటన.. TDP, JSP బలప్రదర్శన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్సీ నాగబాబు ఇవాళ పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా దీనికి స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగా ఉన్నారు. ఈక్రమంలోనే నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన శ్రేణులు బలప్రదర్శనకు దిగాయి. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించాయి.
News April 4, 2025
పిల్లలకు SM నిషేధ అంశం పార్లమెంట్ పరిధిలోనిది: సుప్రీంకోర్టు

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌నే కోరాలని సూచించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.