News March 25, 2024
బీజేపీ చీఫ్ నడ్డా భార్య కారు చోరీ!

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఫార్చూనర్ కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాను సర్వీస్ సెంటర్ వద్ద కారు పార్క్ చేసి భోజనం చేసి వచ్చేసరికి కారును దొంగిలించారని దాని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గురుగ్రామ్వైపుగా ఆ కారు వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
Similar News
News November 27, 2025
హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.
News November 27, 2025
ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

ఈ కింద సూచించిన ఆకుకూరల రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం. వీటిని సరైన యాజమాన్యాన్ని పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
☛ కొత్తిమీర: సిందు సాధన, స్వాతి, సుధా, సుగుణ, సురచి(LCC-234), APHU ధనియా-1 (వేసవి రకం), సుస్థిర
☛ కరివేపాకు: సువాసిని, భువనేశ్వర్, సెంకంపు
☛ మునగ: జాఫ్నా(ఇది బహువార్షిక రకం), పి.కె.యం-1( ఇది ఏక వార్షిక రకం)
News November 27, 2025
ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు..

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
విశ్వమంతా విష్ణువుతో నిండి ఉందని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు. ఈ జగత్తును సృష్టించి, భరించి, పోషించే శక్తిమంతుడు. సమస్త జీవులలో కొలువై ఉన్నాడు. సకల భూతాలకు ప్రాణమిచ్చి, పోషిస్తున్నాడు. అందుకే ఆయనను ఆరాధిస్తే వెంటనే అనుగ్రహించి, మన కష్టాలను దూరం చేస్తాడని అంతా నమ్ముతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


