News June 4, 2024
ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్(29), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), అరుణాచల్ ప్రదేశ్(2), త్రిపుర(2), అండమాన్ నికోబార్(1)లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలుచుకుంది. మిగతా స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.
Similar News
News November 30, 2024
అమరావతిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ: మంత్రి
AP: అమరావతిలో భారీ స్థాయిలో ESI ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ చెప్పారు. అలాగే L&T, IGNOU, CITD, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీలకు స్థలాలు కేటాయించామన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
News November 30, 2024
BGT: రెండో టెస్టుకు హెజిల్వుడ్ దూరం
భారత్‌తో జరిగే BGT రెండో టెస్టుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్వుడ్ గాయం కారణంగా దూరమయ్యారు. పక్కటెముకల్లో నొప్పితో అతడు బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. మరో ఇద్దరు పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డొగెట్ను జట్టుకు ఎంపిక చేసింది. డిసెంబర్ 6 నుంచి జరిగే రెండో టెస్టులో హెజిల్వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్టులో హెజిల్వుడ్ 5 వికెట్లు తీశారు.
News November 30, 2024
బ్రేకప్ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేం: సుప్రీంకోర్టు
ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చెడిపోతే మానసిక వేదనకు గురికావడం సహజమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే బ్రేకప్ను సూసైడ్‌కు ప్రేరేపించినట్లుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇద్దరు విడిపోవడం నేరం కాదని, అందుకు శిక్ష విధించలేమని తేల్చి చెప్పింది. ఇదే తరహా కేసులో కమ్రుద్దీన్ అనే వ్యక్తికి కర్ణాటక హైకోర్టు విధించిన ఐదేళ్ల శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.