News March 20, 2024

రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ECకి BJP ఫిర్యాదు చేసింది. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల ముంబైలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ ‘హిందుత్వంలో శక్తి అనే పదం ఉంటుంది. అది ఎవరనేదే ఇక్కడ ప్రశ్న. మనం దాంతోనే పోరాటం చేస్తున్నాం. దాని ఆత్మ EVM, ED, CBI, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్లలో నిక్షిప్తమై ఉంది’ అని అన్నారు. దీనిపైనే BJP ఫిర్యాదు చేసింది.

Similar News

News December 3, 2025

నాగర్‌కర్నూల్: మూడో దశ నామినేషన్లు రేపటి నుంచి ప్రారంభం

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో జరగబోయే పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూల్ మూడో దశ – 110 గ్రామాలు, 1364 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మూడో దశలో చారకొండ, పదర, బల్మూరు, లింగాల, ఉప్పునుంతల, అచ్చంపేట, అమ్రాబాద్ మండలాలు ఉన్నాయి.

News December 2, 2025

DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్

image

రవాణా వాహనాలకు కేంద్రం ఫిట్‌నెస్ <<18321648>>ఛార్జీలు<<>> పెంచడంపై సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(SIMTA) కీలక నిర్ణయం తీసుకుంది. DEC 9 అర్ధరాత్రి నుంచి రవాణా వాహనాల బంద్ పాటించనున్నట్లు ప్రకటించింది. AP, TN, TG, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 12 ఏళ్లు పైబడిన వాహన యజమానులు ఇందులో పాల్గొంటారని పేర్కొంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది.

News December 2, 2025

రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.