News April 28, 2024
రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: రేవంత్

TG: గుడిలో ఉండాల్సిన దేవుడిని బీజేపీ నేతలు రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలను మోసం చేసేందుకు మోదీ సిద్ధమయ్యారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. రాష్ట్రానికి నిధులు అడిగితే జై శ్రీరామ్ అంటున్నారు. షెడ్డుకు పోయిన కారు ఇక రాదు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ బయల్దేరారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News December 2, 2025
మెదక్: GP ఎన్నికలు.. లెక్క తప్పితే వేటు తప్పదు !

స్థానిక ఎన్నికల నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన ప్రచార ఖర్చులను సర్పంచ్కి రూ.2.5లక్షల నుంచి రూ.1.5లక్షల వరకు ఈసీ ఖరారు చేసింది. గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా లెక్కకు మించి భారీగా వెచ్చిస్తున్నారు. దీంతో డబ్బు ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసి పరిశీలిస్తోంది. వ్యయ పరిమితి దాటితే వేటు తప్పదు జాగ్రత్త.
News December 2, 2025
NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nsic.co.in
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


