News April 27, 2024

రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర: రేవంత్

image

TG: రిజర్వేషన్లను ఎత్తేసేందుకు BJP కుట్ర చేస్తోందని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తోంది. అన్ని రకాల వ్యవస్థలు, సంస్థలు ఉపయోగించుకుని 400 సీట్లు గెలవాలనుకుంటోంది. అక్రమంగా, దౌర్జన్యంగా గెలవాలని ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు’ అని CM ఫైర్ అయ్యారు.

Similar News

News November 17, 2024

కాళేశ్వరంతో సంబంధం లేకుండా రికార్డుస్థాయిలో ధాన్యం: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందని CM రేవంత్ తెలిపారు. 2024లో 66.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగైందని, 153 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందనే వార్తను ట్వీట్ చేశారు. ‘కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న BRS తప్పుడు ప్రచారం పటాపంచలైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా రైతులు ఈ ఘనత సాధించారు’ అని తెలిపారు.

News November 17, 2024

కన్నడ నేర్చుకోవాల్సిందే: ZOHO CEO

image

బెంగళూరులో నివ‌సించే ఇత‌ర రాష్ట్రాల వారు క‌చ్చితంగా క‌న్న‌డ నేర్చుకోవాల‌ని ZOHO CEO శ్రీధర్ వేంబు వ్యాఖ్యానించారు. భాష నేర్చుకోక‌పోతే అది స్థానికత‌ను అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే అవుతుంద‌న్నారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. రోజూ వెయ్యి ప‌నులు చేయాల్సిన ప‌రిస్థితిలో ఏదైనా కొత్త‌గా నేర్చుకొనే విధానం ఆర్గానిక్‌గా ఉండాల‌ని ఒక‌రు, చుట్టూ 90% ఇతర రాష్ట్రాల వారే ఉంటే కొత్త భాష ఎలా సాధ్యమంటూ మరొకరు పేర్కొన్నారు.

News November 17, 2024

వృద్ధులు, వికలాంగులకే ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు’!

image

AP: ప్రజలు ఎక్కడి నుంచైనా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తీసుకొచ్చిన ‘ఎనీవేర్’ విధానంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. దీనిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ విధానాన్ని 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ మేరకు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానున్నాయి.