News December 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.
Similar News
News October 22, 2025
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.
News October 22, 2025
3 సార్లు ఫోన్ చేసినా జగన్ నంబర్ పని చేయలేదు: సీబీఐ

YCP చీఫ్ జగన్ లండన్ పర్యటనకు సంబంధించి <<18018569>>సీబీఐ పిటిషన్<<>>పై వాదనలు పూర్తయ్యాయి. జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు 3సార్లు ఫోన్ చేసినా ఆయన ఇచ్చిన నంబర్ పని చేయలేదని CBI వాదనలు వినిపించింది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ ఇచ్చారంది. మరోసారి జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. జగన్, CBI తరఫు వాదనలు విన్న CBI కోర్టు తీర్పును ఈ నెల 28న వెల్లడిస్తానని పేర్కొంది.
News October 22, 2025
రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పుందా?

రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగే అడిలైడ్‌లో వర్షం ముప్పు 20% ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చని పేర్కొంది. దీంతో 50 ఓవర్ల ఆట జరగనుంది. ఇక తొలి వన్డేకు వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఇందులో AUS 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో నిలవాలంటే రేపటి మ్యాచులో తప్పక గెలవాలి.