News June 4, 2024
పంజాబ్‌లో బీజేపీ డీలా!

పంజాబ్‌లో బీజేపీ డీలా పడింది. 13 చోట్ల ఒక్క స్థానంలోనూ ఆధిక్యం ప్రదర్శించట్లేదు. కాంగ్రెస్ 5, ఆప్ 3, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లో బీజేపీ 13, కాంగ్రెస్ 9, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక హరియాణాలో కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఇతరులు ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.
Similar News
News November 25, 2025
సతీష్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: బీసీ సంఘాలు

పరకమణి కేసులో సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ రావు అన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హత్య ఆత్మహత్య అన్నదానిపై పోలీసులు ఇప్పటివరకు తెలపలేదని, ప్రభుత్వం చేపట్టిన సీఐడి ఇన్వెస్టిగేషన్ నత్త నడకలు నడుస్తుందన్నారు. సతీష్ కుమార్ మృతి పై నిజాలు తెలపాలన్నారు.
News November 25, 2025
500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
News November 25, 2025
బిహార్ ఓటమి.. ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

బిహార్ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. క్రమశిక్షణ, పార్టీ సంస్థాగత సూత్రాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఆదిత్య పాశ్వాన్, షకీలుర్ రెహమాన్, రాజ్ కుమార్ శర్మ, రాజ్‌కుమార్ రాజన్, కుందన్ గుప్తా, కాంచన కుమారి, రవి గోల్డెన్‌ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు కాంగ్రెస్ బిహార్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉత్తర్వులిచ్చారు.


