News June 2, 2024
బీజేపీ పరువునష్టం కేసు.. రాహుల్‌కు కోర్టు ఆదేశాలు

పరువునష్టం కేసుకు సంబంధించి ఈనెల 7న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శనివారం విచారణకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభివృద్ధి పనుల్లో నాటి BJP ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ పరువునష్టం దావా వేసింది.
Similar News
News December 30, 2025
హమాస్‌కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
News December 30, 2025
వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ <<18708686>>వేకువజామున<<>> శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. 5.30AM నుంచి ఈ-డిప్లో టోకెన్లు పొందిన వారిని అనుమతివ్వనున్నారు. సోమవారం రాత్రి వరకు 55వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు అంచనా. TG CM రేవంత్ రెడ్డి, పలువురు AP మంత్రులు సహా పెద్ద సంఖ్యలో VIPలు చేరుకున్నారు.
News December 30, 2025
ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్

AP: ప్రజలు ఎన్నుకున్న సీఎంలా కాకుండా, ప్రైవేటు వ్యక్తుల ప్రతినిధిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు.. ఇలా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. పీపీపీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని చెప్పడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో పరిపాలనను కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు.


