News March 26, 2025
ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ

అక్రమ బంగారం సరఫరా కేసులో పట్టుబడిన నటి <<15789629>>రన్యా రావుపై అసభ్యకర వ్యాఖ్యలు <<>>చేసిన కర్ణాటక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్పై బీజేపీ వేటు వేసింది. పదే పదే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటనలో పేర్కొంది. పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
Similar News
News January 9, 2026
హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.
News January 9, 2026
జనవరి 09: చరిత్రలో ఈరోజు

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం
News January 9, 2026
ఘనంగా ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

AP: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ఘనంగా ముగిశాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ పవిత్ర దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. 9 రోజుల్లోనే 7 లక్షల మందికి పైగా దర్శన భాగ్యం కలగగా, పదో రోజుతో ఈ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరనుంది. ఈ సందర్భంగా హుండీ కానుకలుగా రూ.36.86 కోట్లు లభించాయి. 37.97 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.


