News August 31, 2025
బీసీ బిల్లుకు BJP పూర్తి మద్దతు: పాయల్ శంకర్

TG: బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 1, 2025
ద్రవిడ్ అప్‌సెట్ అయ్యారేమో: ABD

RR కోచ్‌గా ద్రవిడ్ పదవీకాలం ముగిసిందని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆయన్ను అప్‌సెట్ చేసి ఉంటుందని SA మాజీ క్రికెటర్ ABD అన్నారు. ‘ద్రవిడ్‌ను కోచ్‌గా తొలగించి వేరే రోల్ ఆఫర్ చేశారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. బహుశా కోచ్‌గా ఉండాలని అనుకున్నారేమో. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. బట్లర్ వంటి అద్భుతమైన ప్లేయర్లను వదులుకుని RR తప్పు చేసింది’ అని ABD అభిప్రాయపడ్డారు.
News September 1, 2025
వినాయకుడి స్త్రీ రూపం గురించి తెలుసా?

వినాయక నవరాత్రుల వేళ ‘విఘ్నేశ్వరి’ అమ్మవారి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. గణేశుడి అరుదైన స్త్రీ రూపమే ఈ గణేశ్వరి అమ్మవారు. ఆమె 64 యోగినిలలో(శక్తివంతమైన దేవతల సమూహం) ఒకరిగా చెబుతుంటారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తే.. అడ్డంకులను తొలగించే శక్తిగా గణేశ్వరిని పూజిస్తారు. TNలోని శుచీంద్రంలో గణనాథుడిని గణేశ్వరిగా చూడొచ్చు. మదురై మీనాక్షి ఆలయంలోనూ వ్యాఘ్రపాద వినాయకిని దర్శించుకోవచ్చు.
News September 1, 2025
సెల్ఫ్ అబార్షన్ మందులతో ముప్పు

మహిళలు వివిధ కారణాల వల్ల గర్భస్రావం మందులు వాడతారు. అయితే వైద్యుల సూచన లేకుండా వీటిని వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు నిపుణులు. గర్భసంచి వీక్ అవడం, రక్తహీనత, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంటే పుట్టబోయే బిడ్డకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో సొంత వైద్యం చేసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.