News June 27, 2024
ప్రభుత్వాలను కూల్చిన నీచ చరిత్ర బీజేపీది: BRS

అధికార దాహంతో పార్టీ ఫిరాయింపులను నాడు BRS, నేడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నాయంటూ టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది. దీనిపై BRS స్పందిస్తూ ‘చంపినోడే సంతాపం తెలిపినట్టుంది BJP వ్యవహారం’ అంటూ మండిపడింది. ‘గత పదేళ్లలో ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా, మేఘాలయ, జమ్మూ&కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూల్చిన నీచ చరిత్ర బీజేపీది’ అని విమర్శించింది.
Similar News
News January 6, 2026
మంటలతో ప్రమాద తీవ్రత తగ్గింది: కోనసీమ కలెక్టర్

AP: కోనసీమ జిల్లా బ్లోఅవుట్ మంటలను ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బ్లో క్యాపింగ్‌కు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. మంటల వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని, గ్యాస్ వ్యాపించి ఉంటే ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండేదన్నారు. దాదాపు 100 కొబ్బరిచెట్లు, 2 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన స్థానికులు, రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
News January 6, 2026
అమర్త్యసేన్‌కు SIR నోటీసులా?: TMC నేత ఫైర్

SIR విచారణకు రావాలని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు EC నోటీసులిచ్చిందని TMC నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. బెంగాల్ ప్రజలను ఎన్నికల సంఘం, బీజేపీ వేధింపులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. ‘దేశం గర్వించదగిన అమర్త్యసేన్‌ను విచారణకు ఎలా పిలుస్తారు? ప్రముఖ నటుడు దేవ్, వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడిన షమీకి నోటీసులిచ్చారు. ఇది బాధాకరం’ అని అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 6, 2026
విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్!

AP: విశాఖలో పర్మనెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. యెండాడ, పరదేశిపాలెం సమీపంలో ఆ కంపెనీ ప్రతినిధులు భూములు పరిశీలించారు. ఎకరం 99 పైసల చొప్పున 20 ఎకరాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల చివర్లో దీనిపై ప్రకటన రానుంది. ఇన్ఫోసిస్‌తో పాటు TCS, యాక్సెంచర్, కాగ్నిజెంట్ కంపెనీల రాకతో విశాఖలో ఐటీ క్రేజ్, ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది.


