News October 25, 2024

ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ

image

TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేశ్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది.

Similar News

News October 25, 2024

తీవ్ర తుఫాన్.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. వాయవ్య దిశగా గంటకు 13కి.మీ వేగంతో కదులుతూ పారాదీప్‌కు ఆగ్నేయంగా 80కి.మీ దూరంలో ఉంది. ఇవాళ ఉదయం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఏపీపై దీని ప్రభావం లేకపోయినా శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపటి నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

News October 25, 2024

ఇకపై టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికీ ఓటు హక్కు

image

TG: ఉపాధ్యాయ నియోజకవర్గ MLC ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాబితాలో వాళ్లు పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కాగా ఇప్పటివరకు హైస్కూల్‌లో బోధించే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండేది.

News October 25, 2024

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని, 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామంది. పూర్తి వివరాలకు TGPMB వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.