News March 17, 2024
కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదు: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారా? అని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కేసులో ఆమె అరెస్టయ్యారని, ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో NDA 400+ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 22, 2025
సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో ED ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ED ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించి ట్రయల్ కోర్టు తప్పుచేసిందని SG మెహతా HCకి నివేదించారు. దర్యాప్తు పూర్తైందని, ఈడీ సాక్ష్యాధారాలూ సేకరించిందన్నారు. దీంతో సోనియా, రాహుల్ సహా నిందితులకు నోటీసులిచ్చి కేసును MAR 12కి HC వాయిదా వేసింది. కాగా పోలీసు FIRతో కాకుండా సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ ఆధారంగా ED ఛార్జ్‌షీట్ వేయగా ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
News December 22, 2025
హార్మోనల్ ఇంబాలెన్స్‌ని ఎలా గుర్తించాలంటే?

మన శరీరంలోని హార్మోన్లు మానసిక స్థితి, శక్తి, జీవక్రియ, నిద్ర, ఆకలి, పునరుత్పత్తి ఆరోగ్యం ఇలా అన్నిటిని నియంత్రిస్తాయి. అయితే ఇవి అస్తవ్యస్తం అవ్వడం వల్ల మహిళల్లో గర్భం, PCOS, థైరాయిడ్ సమస్యలు వస్తాయి. వీటితో పాటు నిరంతర అలసట. ఆకస్మిక బరువు పెరగడం లేదా తగ్గడం, మొటిమలు, జుట్టు రాలడం, మానసిక అనారోగ్యాలు, అధిక నిద్ర, జీర్ణ సమస్యలు, ముఖం వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
News December 22, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘నో అడ్మిషన్’ బోర్డు కోసం ఏం మార్చాలి?

విద్యారంగంపై పాలకులు ఎన్ని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా టీజీలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేక <<18629441>>ఖాళీ<<>> అవుతున్నాయి. మౌలిక సదుపాయాల లోపం, ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల మొగ్గు, ప్రైవేట్ స్కూళ్ల పోటీయే దీనికి కారణం. ఉపాధి కోసం వలసలు వెళ్లడం, గురుకులాల వైపు విద్యార్థులు మళ్లడంతో పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం ఏంచేయాలో కామెంట్ చేయండి.


