News May 11, 2024

దక్షిణాదిలో బీజేపీ పాగా.. తెలంగాణలోనే ఎక్కువ ఛాన్సులు? – 1/2

image

ఎన్నికల వేళ ప్రధాని మోదీ విస్తృత పర్యటనలతో దక్షిణాదిలో BJP భవిష్యత్తు చర్చనీయాంశమైంది. దక్షిణాదిపై పట్టు సాధించాలనేది ఆ పార్టీ కల. కర్ణాటకలో ఇప్పటికే BJP మార్క్ ఉన్నా తెలంగాణలో నిలదొక్కుకోవడాన్ని ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందంటున్నారు విశ్లేషకులు. ఫలితాల మాట అటుంచితే ఇతర దక్షిణాది రాష్ట్రాలతో (కర్ణాటక కాకుండా) పోలిస్తే తెలంగాణలో BJP పాగా వేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. <<-se>>#Elections2024<<>>

Similar News

News February 6, 2026

సింహాచలం కొత్త ఈవో ఆ సెంటిమెంట్‌కు చెక్ పెడతారా?

image

సింహాచలంలో ఈవోలను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన అధికారులకు ఈ ఆలయం పూర్తిగా కలిసిరాలేదన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ పని చేసిన ఈవోలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. చందనోత్సవంలో గోడకూలిన ఘటనలో సుబ్బారావు సస్పెండ్ కాగా.. సూర్యకళపై ఏసీబీ అధికారుల దాడి జరిగింది. ఇదే విభాగం నుంచి వచ్చిన కొత్త ఈవో వెంకటరావు ఈ సెంటిమెంట్‌‌కు చెక్ పెడతారేమో చూడాలి.

News February 6, 2026

నాగాలాండ్‌లో కీలక ఒప్పందం.. అసలేంటిది?

image

తూర్పు నాగాలాండ్‌లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అమిత్ షా సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది. కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య ఇది కుదిరింది. ఇందులో భాగంగా స్వయం ప్రతిపత్తితో ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ(FNTA) ఏర్పాటవుతుంది. మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాలను అభివృద్ధి చేస్తారు. 8 ప్రధాన నాగా తెగల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు.

News February 6, 2026

INDతో మ్యాచ్.. పాక్ యూటర్న్ కన్ఫర్మ్: చేతన్ శర్మ

image

T20 WCలో భాగంగా ఈ నెల 15న భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తామని పాక్ చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా డ్రామా అని, ఈ నెల 12 తర్వాత PCB యూటర్న్ తీసుకుంటుందని BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అన్నారు. ‘ఈ నెల 12న బంగ్లాదేశ్ ఎలక్షన్స్ ఉండటంతో రాజకీయ లబ్ధి కోసం ఈ డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల తర్వాత క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు.. మ్యాచ్ ఆడండి అంటూ ప్రకటన వస్తుంది’ అని పేర్కొన్నారు.